మోడల్ స్కూల్‌లో బోధించుటకు దరఖాస్తుల ఆహ్వానం

by Aamani |
మోడల్ స్కూల్‌లో బోధించుటకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, చిట్యాల : మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల, కళాశాలలో గంటల ప్రాతిపదికన, ఆంగ్ల మాధ్యమంలో పని చేయుటకు దరఖాస్తు చేసుకోవాలని, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఎం. రమేష్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా పీజీటీ విభాగంలో పొలిటికల్ సైన్స్-1, ఎకనామిక్స్-1, టీజీటీ విభాగంలో తెలుగు-1, ఇంగ్లీష్-1, సోషల్-1, సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పీజీటీలు 9వ తరగతి నుంచి, 12వ తరగతి వరకు బోధించవలసి ఉంటుందన్నారు. టీజీటీ లు 6వ తరగతి నుండి, 8వ తరగతి వరకు బోధించవలసి ఉంటుందని తెలిపారు. పీజీటీలు దరఖాస్తులు తమకు సంబంధించిన సబ్జెక్టులలో, పీజీ ,బీఈడీ పూర్తి చేసి అర్హత కలిగి ఉండాలన్నారు. టీజీటీలు డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత కలిగి ఉండాలని అన్నారు. దరఖాస్తులు ఈనెల 24 వరకు స్వీకరిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed