- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్యాలలో సిట్ అధికారుల విచారణ
దిశ, జగిత్యాల ప్రతినిధి/మల్యాల: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏ-2 ముద్దాయిగా ఉన్న అట్ల రాజశేఖర్ రెడ్డి సొంత మండలంలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు.మల్యాల మండలానికి చెందిన కొంతమంది పరీక్ష రాసిన అభ్యర్థుల పట్ల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిట్ అధికారులు వారి నుంచి సమాచారం సేకరించినట్లుగా స్పష్టమవుతోంది.
మంగళవారం మండలానికి వచ్చిన సిట్ బృందం మండలంలోని గ్రూప్-1 రాసిన సుమారు 30 మందికి పైగా అభ్యర్థులను విచారంచినట్లు సమాచారం. సదరు అభ్యర్థులకు లీకేజ్వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
మండలానికి చెందిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వారి పిల్లలు బంధువులపై కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం.అయితే విచారణకు సంబంధించిన ఎలాంటి వివరాలను సిట్ అధికారులు వెల్లడించడం లేదు. మరో రెండు రోజులు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సిట్ అధికారుల బృందం విచారణ చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.