- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంటు కావాలంటే కారును గెలిపించండి : హరీష్ రావు
దిశ, చిగురుమామిడి : ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్ అని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీష్ కుమార్ తో కలిసి చిగురుమామిడి మండలం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈసందర్బంగా హరీష్ మాట్లాడుతూ..కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని,గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నా ఇలాంటి అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత, హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో మోసం చేశారని, ఇప్పుడు ఆరు గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేయడానికి వస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ ను నమ్మితే కైలాసం ఆటలో పాము మింగినట్టేనని, ఆరు గ్యారెంటీలు ఏమో గానీ, ఆ పార్టీని గెలిపిస్తే ఆరు నెలలకు ఒక్కరు సీఎం అవుతారన్నారని ప్రజలకు వివరించారు. పొన్నం ప్రభాకర్ పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు. వాళ్ల దాంట్లో ఉన్న దానికంటే మన మేనిఫెస్టో ఎంతో మంచిదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ ఇనుగాల పెద్దిరెడ్డి, ఎంపీపీ కొత్త శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఓగులాపూర్ సమస్యను పరిష్కరిస్తా..
చిగురుమామిడి మండలంలోని ఒగులాపురం గ్రామంలోని భూ నిర్వాసితుల సమస్యలను తాను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఓబులాపూర్ గ్రామస్తులకు ఆర్ ఆర్ ప్యాకేజీ కావాలా, భూములు కావాలా, ఉద్యోగాలు కావాలా మీరు నిర్ణయించుకోండి అని సూచించారు. ఆ ఊరి సమస్యను ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో పాటు తాను కూడా కలిసి వచ్చి తప్పకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.