రాజ్ భవన్‌లో 'రాజన్నసిరిపట్టు' ప్రదర్శన.. గవర్నర్ ప్రశంస

by Vinod kumar |   ( Updated:2023-01-01 11:24:40.0  )
రాజ్ భవన్‌లో రాజన్నసిరిపట్టు ప్రదర్శన.. గవర్నర్ ప్రశంస
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో సిరిసిల్ల నేత కళకారుడు నేచిన 'రాజన్న సిరిసిల్ల పట్టు' పట్టు చీరలను ఆదివారం ప్రదర్శించారు. సిరిసిల్ల ఉత్పత్తులను గవర్నర్ తమిళిసై ముగ్ధులయ్యారు. రాస్ట్ర చేనేత ఉత్పత్తులను నూతన సంవత్సరం సందర్బంగా రాజ్భవన్‌లో ప్రదర్శించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల నేతన్న వెల్ధి హరిప్రసాద్‌కు ఆహ్వానం అందగా.. రాజన్నసిరిసిల్ల పట్టు చీరలను ప్రదర్శించారు. దాంతోపాటు అగ్గిపెట్టెలో ఇమిడి చీర, దేశ ప్రధాని మోడీ, రాష్ట్రపతి ఫోటోలతో నేచిన ఉత్పత్తులను చూసి అభినందించారు.


జీ 20 లోగో నేనే చేసిందని చెప్పడంతో.. తెలుగులో తాను నాకు సంతోషం అనిపించిందని గవర్నర్ పేర్కొనడంతో సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరి పట్టుకు రాజభవన్‌లో ప్రదర్శించడానికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని హరిప్రసాద్ తెలిపారు. హరిప్రసాద్‌ను సిరిసిల్ల పద్మశాలీ ప్రముఖులు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అభిందించారు.

Advertisement

Next Story

Most Viewed