- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టుల్లో ఆడాలని ఉంది : అర్ష్‌దీప్ సింగ్
దిశ, స్పోర్ట్స్ : టెస్టుల్లో ఆడాలని ఉందని టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన కోరిన బయటపెట్టాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. టెస్టులు సహా మూడు ఫార్మాట్లలో ఆడాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా మనం రెడ్ బాల్‌తో కెరీర్‌ను మొదలుపెడతాం. మనం పట్టుకునే మొదటి బంతి రెడ్ బాలే. ఎర్రబంతితో బౌలింగ్ చేయడం సరదాగా ఉంటుంది. ఎందుకంటే అది ప్రారంభంలో స్వింగ్ అవుతుంది. పాతబడినా స్వింగ్ రాబట్టొచ్చు. మూడు ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం.’అని అర్ష్‌దీప్ తెలిపాడు.
ఈ సందర్భంగా స్టార్ పేసర్ బుమ్రాతో సంభాషణను పంచుకున్నాడు. ‘ఓ సారి బుమ్రా మూడు ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నావా? అని నన్ను అడిగాడు. అవును, నేను మూడు ఫార్మాట్లలో ఆడటానికి ఆసక్తిగా ఉన్నా. భారత్ తరపున మరిన్ని మ్యాచ్‌లు గెలవాలని కోరుకుంటున్నానని అతనితో చెప్పా.’ అని చెప్పుకొచ్చాడు.
అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. అర్ష్‌దీప్‌ను ప్రశంసించాడు. టెస్టుల్లో జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, ఆర్పీ సింగ్ వంటి దిగ్గజ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల అడుగుజాడల్లో అర్ష్‌దీప్ నడిచే అవకాశం ఉందని చెప్పాడు. ‘చాలా రోజుల తర్వాత నార్త్ ఇండియా నుంచి ఓ పొడువాటి ఫాస్ట్ బౌలర్‌ను చూశా. అతను స్వింగ్, రివర్స్ సింగ్ రాబట్టగలడు. అర్ష్‌దీప్ టెస్టు క్రికెట్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆస్ట్రేలియాకు అతన్ని పంపించాల్సింది. కొత్త, పాత బంతితో కీలక సమయాల్లో వికెట్లు తీసే అతన్ని భవిష్యత్తులో పెద్ద సిరీస్‌లకు ఎంపిక చేయాలి.’ అని రైనా చెప్పుకొచ్చాడు.