Priyanka: రెండు మ్యాథ్స్ క్లాసులు విన్నట్టుంది.. మోడీ స్పీచ్ పై ప్రియాంక గాంధీ సెటైర్

by vinod kumar |
Priyanka: రెండు మ్యాథ్స్ క్లాసులు విన్నట్టుంది.. మోడీ స్పీచ్ పై ప్రియాంక గాంధీ సెటైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఇచ్చిన స్పీచ్‌పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) సెటైర్ వేశారు. మోడీ మాటలు వింటుంటే రెండు గణితం క్లాసులు వరుసగా విన్నట్టుందని ఎద్దేవా చేశారు. ప్రధాని పూర్తిగా విసుగు తెప్పించారని విమర్శించారు. ‘ప్రధాని కొత్తగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను మాకు విసుగు పుట్టించాడు. నన్ను దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లారు. చాలా రోజుల తర్వాత గణితం క్లాసులో కూర్చున్నట్టు అనిపించింది’ అని పేర్కొన్నారు. ‘మోడీ ప్రసంగిస్తు్న్న టైంలో కేంద్ర మంత్రి నడ్డా (Nadda) కూడా చేతులు దులుపుకున్నారు. కానీ మోడీ అతని వైపు చూడగానే శ్రద్ధగా వింటున్నట్టు నటించాడు. అమిత్ షా (Amith shah) సైతం తలపై చేయి వేసుకున్నాడు. పీయూష్ గోయల్ (Piyush goyal) నిద్రపోతున్నాడు. ఇది నాకు కొత్త అనుభవం. ప్రధాన మంత్రి ఏదైనా మంచిగా చెబుతారని అనుకున్నా. కానీ పూర్తిగా బోర్ కొట్టించారు’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed