Sandhya Theatre stampede : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన.. బాలుడి పరిస్థితి విషమం

by M.Rajitha |
Sandhya Theatre stampede : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన.. బాలుడి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్‌(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం సంగతి తెలిసిందే. కాగా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తొక్కిసలాట జరిగిన రోజు బాలుడిని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రిలో జాయిన్ చేసిన కుటుంబ సభ్యులు.. మెరుగైన వైద్యం కోసం బేగంపేటలోని కిమ్స్(KIMS) ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. శ్రీతేజకు అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు మాత్రం ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed