- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur: మణిపూర్‌లో బిహార్ కూలీల కాల్చివేత.. కక్చింగ్ జిల్లాలో ఘటన
దిశ, నేషనల్ బ్యూరో: జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు బిహార్ (Bihar) కూలీలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాష్ట్రంలోని కక్చింగ్ (Kaktching) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని గోపాల్‌గంజ్ (Gopalganj) జిల్లాకు చెందిన సునాలాల్ కుమార్ (18), దశరథ్ కుమార్ (17)లు మైతీల ఆధిపత్యం ఉన్న కక్చింగ్ జిల్లాలో నివాసముంటూ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం పనికి వెళ్లి వస్తుండగా 5:20 గంటల సమయంలో కక్చింగ్-వాబగై రోడ్డులోని కెరక్ పంచాయతీ కార్యాలయం సమీపంలో వీరిద్దరినీ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు పాల్పడింది ఎవరు అనే విషయాలను వెల్లడించలేదు. రాష్ట్రంలో జరిగిన మరో ఘటనలో తౌభాల్ జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హత మార్చాయి. ఇప్పటికే హింసాత్మక పరిస్థితులు నెలకొన్న మణిపూర్‌లో తాజా హత్యలతో భయాందోళనలు మరింత పెరిగాయి.