ప్రయాణికులకు మరో భారీ గుడ్‌న్యూస్.. రీజియన్ ఆర్‌ఎం కీలక ప్రకటన

by Anjali |
ప్రయాణికులకు మరో భారీ గుడ్‌న్యూస్.. రీజియన్ ఆర్‌ఎం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ నుంచి నిజామాబాద్ మార్గంలో ప్రయాణికులకు కరీంనగర్ రీజియన్ ఆఎం సుచరిత శుభవార్త అందించారు. వరంగల్ నుంచి నిజామాబాదు మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి డీలక్స్ బస్సులు నడపనున్నట్లు రీజియన్ ఆర్ఎం సుచరిత ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే డీలక్స్ బస్సులను అదనంగా నడుపుతున్నామన్నామని ఆమె తెలిపారు. కాగా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజియన్ ఆర్ఎం సుచరిత పేర్కొన్నారు. కానీ మహాలక్ష్మి పథకం కింద వచ్చిన టీజీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉచిత బస్సులను ఉపయోగించుకుంటున్నారు. దీంతో టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాదులో అయితే చాలా దూరం వరకు నిల్చొనే ప్రయాణం చేయాల్సింది. అంతేకాకుండా ఫ్రీ బస్సు కారణంగా కండక్టర్లకు, ప్రయాణికులకు పలుచోట్ల గొడవలకు కూడా తావుతీస్తుంది.

Advertisement

Next Story

Most Viewed