- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడల్ స్కూల్లో చెత్త.. లోపించిన పరిసరాల పరిశుభ్రత
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మోడల్ స్కూల్ లో శుభ్రత లోపించిందని స్వాతంత్ర దినోత్సవం రోజు స్కూల్ వెనుక పరిసరాలను చూసి పలువురు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్, కాలేజీల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి.ప్రిన్సిపల్ పరిసరాల పరిశుభ్రతను గాలికొదిలేసిందా?? అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. ముఖ్యంగా స్కూల్ ముందు భాగం మాత్రమే శుభ్రంగా ఉంచి స్కూల్ వెనుక భాగం ప్రహరీ గోడ లోపల నే చెత్తాచెదారం నిండి ఉంది. ప్రహారీ గోడ పొడవునా వెనుక భాగంలో డంపు యార్డు ని తలపించేలా చెత్తాచెదారం, పేపర్లు , పాత ప్లేట్లు, గ్లాసులు మొదలగునవి విసిరి వేశారు. అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఉధృతంగా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠాలు చెప్పే టీచర్లు తమ పాఠశాల ప్రహరీ లోపల పరిశుభ్రతను మరిచారా ??అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి .వందల మంది విద్యార్థులు చదువుకునే ఈ స్కూల్లో విచిత్రంగా అపరిశుభ్రత తాండవిస్తుంది. పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పే టీచర్లు తమ స్కూల్ పరిసరాలను శుభ్రపరుచుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చిట్టా జ్యోతిని వివరణ అడగగా అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రపరుస్తామని తెలిపారు.