- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండగట్టు దొంగల పట్టివేత
దిశ, జగిత్యాల ప్రతినిధి: ఫిబ్రవరి 23వ తేదీ అర్ధరాత్రి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 23న అర్ధరాత్రి కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలోకి చొరబడిన దొంగలు గర్భగుడి తాళాలు పగలగొట్టి 15 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లుగా తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 24 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు.
నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, నర్సింగ్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్ గా గుర్తించినట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల నుండి ఒక వెండి శఠగోపం, వెండి గొడుగు, వెండి పెద్ద రామరక్షా, రెండు ద్వారాలకు గల కవచము ముక్కలు, ఒక మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు.
- Tags
- kondagattu