ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

by Sumithra |
ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
X

దిశ, కోరుట్ల టౌన్ : ప్రజలకు దూరాభారం తగ్గేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేల కల్లూరు రోడ్ లో తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించనున్నామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో ఉంచి తహసీల్దార్ కార్యాలయాన్ని కల్లూరు రోడ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.

తహసీల్ధార్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే ఆఫీస్ మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం ఒకే చోట ఉండి ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షడు చీటీ వెంకట్రావు, బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షుడు దరిశెట్టి రాజేష్, అన్నం అనిల్, నాయకులూ సాయిని రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story