- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
చేపల పెంపకంతో మత్స్యకారులకు లబ్ధి
దిశ, ఇల్లంతకుంట : మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్రం ప్రభుత్వం చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకం చేపడుతోందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ లో శుక్రవారం ఆయన జిల్లా మత్స్య శాఖ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టిందన్నారు.
ప్రస్తుతం ఈ రిజర్వాయర్ లోకి 80 నుంచి 100 మిల్లీ మీటర్ల పొడవు గల చేప పిల్లలను వదిలినట్టు తెలిపారు. గంగపుత్రులు, ముదిరాజులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా మత్స్యకారుల కుటుంబాలు లబ్ధిపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్, మండల అధ్యక్షుడు బి.రాఘవరెడ్డి, పార్టీ నాయకులు గుడిసె అయిలయ్య యాదవ్, పాశం రాజేందర్ రెడ్డి, పసుల వెంకటి, ఎలగందుల ప్రసాద్, రజనీకాంత్, అంతగిరి, గోపాల్, కరుణాకర్ రెడ్డి, జమాల్, నరేశ్ తోపాటు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.