Polavaram Project:పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టానికి శ్రీకారం

by Jakkula Mamatha |
Polavaram Project:పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టానికి శ్రీకారం
X

దిశ ప్రతినిధి, ఏలూరు: ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టానికి అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజక్టులో కీలకమైన జలవిద్యుత్‌ కేంద్రం టర్బైన్ల ఏర్పాటులో కీలకమైన స్టే రింగ్‌ల అమరిక పనులను ప్రారంభించారు. ఈ అమరికకు 320 టన్నుల సామర్ధ్యం కలిగిన క్రాలర్‌ క్రేన్‌ వినియోగించారు. స్టే రింగ్ అమరిక పనుల ప్రారంభ సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో పోలవరం జల విద్యుత్ కేంద్రం ఏపీ జెన్‌కో ఎస్ఈ రామభద్రరాజు, ఈఈ వై భీమాధనరావు, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర, ఎలక్ట్రో మెకానికల్ విభాగం సీనియర్ మేనేజర్ మణికంఠ పాల్గొన్నారు.

ప్రాజెక్ట్‌లో ఈ స్టే రింగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో స్టే రింగ్ 4 విభాగాలుగా ఉంటుంది . దీని బరువు 136 మెట్రిక్ టన్నులు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కప్లాన్ టర్బైన్ లు సమర్ధవంతంగా పనిచేయడంలో ఈ స్టే రింగ్ లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాజెక్ట్ లో కీలకమైన నిర్మాణ పనులు దీని అమరిక తర్వాత కొనసాగిస్తారు. ఈ సందర్భంగా ఎస్ఈ రామభద్రరాజు మాట్లాడుతూ జల విద్యుత్ కేంద్రంలో స్టే రింగ్ ల ఏర్పాటు తరువాతే టర్బైన్ల అమరిక చేపడతారని తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం కాకుండా ఉండేందుకు అన్ని పనులు సమాంతరంగా చేస్తున్నట్లు తెలిపారు. ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed