MPHA Jobs: మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 29న పరీక్ష

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-08 15:14:32.0  )
MPHA Jobs: మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 29న పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటల్స్(Government Hospitals)లో ఖాళీల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసింది. గవర్నమెంట్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 1520 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్(Female) పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ పోస్టులకు డిసెంబర్ 29వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామని బోర్డు శుక్రవారం ప్రకటించింది. కంప్యుటర్ బేస్ట్ టెస్ట్(CBT) విధానంలో ఎగ్జామ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story