- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు శాలువా సీఎం కు బహుకరణ
దిశ, హుస్నాబాద్ ; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ సీఎం పై అభిమానంతో ముఖచిత్రం చేయాలనే తపనతో అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు శాలువాను తయారు చేయించి శుక్రవారం యాదాద్రి దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా బహుకరించారు. కాగా ఈ ప్రత్యేకమైన శాలువా వెడల్పు 34 ఇంచులు పొడవు 2 మీటర్లు బరువు 200 గ్రాములు ఉండడం విశేషం. ఇది నేయడానికి 3 రోజుల కాల వ్యవధి తీసుకుందని శ్రీనివాస్ తెలిపారు. ఇదే సంవత్సరం ఉగాది పర్వదినాన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలో ఇదే తరహాలో బంగారు పూతతో నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాను మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహుకరించి అభిమానం చాటుకున్నారు. సీఎంకు బహుకరించిన ముఖచిత్రంతో నేసిన శాలువాను సిరిసిల్లకు చెందిన నల్ల పరంధాములు తనయుడు విజయ్ నేయడం విశేషం. అదేవిధంగా గతంలో వీరు మూడు ఇంచుల నానో బ్యాగులను తయారు, చింతాకుల నుంచి దూరే చీర తయారు ఇలా సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పే విధంగా తయారు చేయించడం గమనార్హం.