- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే 20 కేజీల క్లోరల్ హైడ్రేట్ కెమికల్ పట్టివేత
దిశ, కొడంగల్ (బొంరాస్ పేట్ ):- వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్,కొండంగల్ పోలీస్ అధికారులు కొడంగల్ కూడలిలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో, వాహనాన్ని అపి వాహన డ్రైవర్ ను విచారించగా, బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ గా తేలింది. అందులో కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే క్లోరల్ హైడ్రేట్ 10 కేజీలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కల్తీ కల్లు తయారుచేసి,విక్రయించడం జరుగుతుందని తెలిపారు. దీనిని కర్ణాటక రాష్ట్రం చించోలికి చెందిన మేఘనాథ్ గౌడ్, బషీరాబాద్ మండలం కేంద్రానికి చెందిన నగేష్ గౌడ్ కొన్నారని తెలిపాడు.మేఘనాథ్ గౌడ్ ను అదుపులోకి తీసుకోని విచారించగా,చితపూర్ కు చెందిన ఉష్ణయ్యగౌడ్ దగ్గర కెమికల్ ను కొనడం జరిగిందన్నారు. మేఘనాథ్ గౌడ్ దగ్గరి నుండి 5 కేజీలు, ఉష్ణయ్యగౌడ్ దగ్గరి నుండి 5 కేజీలు క్లోరల్ హైడ్రేట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీలో సుమారు రూ. 60,000 విలువగల 20 కేజీల క్లోరల్ హైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపైన కొడంగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కు తరలించారు. క్లోరల్ హైడ్రేట్ కెమికల్ కలిపి తయారు చేసిన కల్లును సేవించడం వలన, సేవించిన వ్యక్తులకు మత్తు కలిగించడమే కాకుండా, మెదడు,ఇతర శరీర భాగాల మీద ప్రభావం చూపి అనారోగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. కల్తీ కల్లును ఒక సారి సేవించిన వారికి ఇది ఒక డ్రగ్ లాగా, అలవాటుపడి దానికే బానిస అయిపోతారన్నారు. ప్రజలు ఈ కల్తీ కల్లు పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరు కూడా కల్తీ కల్లును సేవించవద్దని,ఎక్కడైనా కల్తీ కల్లుకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
జిల్లాలో ఎవరైనా ఈ కెమికల్ ను ఉపయోగించి,కల్తీ కల్లు తయారు చేసిన,గంజాయి లాంటి మత్తు పదార్థాల వ్యాపారం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.మత్తు పదార్థాల వ్యాపారాలు,కల్తీ వ్యాపారాలు,అక్రమ రవాణా లు,అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.టాస్క్ ఫోర్స్ అధికారులతో జిల్లా వ్యాప్తంగా,నిఘా పెట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు.