పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ నిరసనకు మద్దతు

by Y.Nagarani |   ( Updated:2024-11-08 15:47:16.0  )
పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ నిరసనకు మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ నవంబర్ 9న ఇచ్చిన నిరసన కార్యక్రమాలకు పీవోడబ్ల్యూ, పీఎంఎస్, ఐజేఎం మద్దతు తెలిపిందని కన్వీనర్ ఝాన్సీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ నవంబర్ 1న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో నవంబర్ 9న అభయకు న్యాయం జరగకుండా మూడు నెలలు గడిచిపోయిందని, ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అభయకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ రోజున దేశ వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి రావాలని ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రగతిశీల మహిళా సంఘటన్ ఢిల్లీ, ఇస్త్రి జాగృతి మంచ్ (ఐజెఎం) పంజాబ్ సంఘాలు పిలుపునిచ్చాయి. సీల్దా ట్రయల్ కోర్టులో సీబీఐ (CBI) దాఖలు చేసిన ఛార్జిషీట్‌కు సంబంధించి వారు అనేక నిర్దిష్ట ప్రశ్నలను కూడా లేవనెత్తారని, పీవోడబ్ల్యూ పీఎంఎస్ ఐజేఎం సంఘాల ఆల్ ఇండియా కోఆర్డినేషన్ అభయకు న్యాయం కోసం పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతుందని కన్వీనర్ ఝూన్సీ ప్రకటించారు. నవంబర్ 9న వారి పిలుపు కు మద్దతుగా ఆ రోజున తాము సాధ్యమైన చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తామని, నిరసన కార్యక్రమాలలో పాల్గొంటామని వివరించారు. నిరంతర సంఘటిత పోరాటమే అభయకు న్యాయం చేకూర్చే ఏకైక మార్గమని వారు పేర్కొన్నారు. సీబీఐ విచారణకు సుప్రీం కోర్ట్ గడువు విధించలేదని, చాలా స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, అత్యాచారం, హత్య, అభయ కేసులో ఆ విషయాన్ని కప్పిపుచ్చినట్లుగా తెలిపారు. కుట్రలో దోషులను పేర్కొనబడకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. న్యాయం ఆలస్యం అవ్వడం అంటే అన్యాయం జరగడమేనని, నిష్పక్షపాతంగా, శాస్త్రీయంగా, కాలపరిమితితో, వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed