- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకే అసత్య అరోపణలు: ఎమ్మెల్యే కోరుకంటి చందర్
దిశ, గోదావరి ఖని: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై అసత్య అరోపణలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకోవాలని కాంగ్రెస్ పాదయాత్ర చేస్తోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించి నాశనం చేసిందని ధ్వజమెత్తారు. శ్రీపాద ప్రాజెక్టుతో ఒరిగిందేమీ లేదన్నారు.
కాలువలు, చెరువుల్లో నీరు లేక తెలంగాణ ప్రాంతంలో నేల నెర్రెలు వాసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు సాగు నీరందుతోందని, దీంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందన్నారు. చంపిన వాళ్లే.. సంతాప సభ పెట్టినట్లుగా తమ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్లే ఇపుడు అభివృద్ది గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ కు ఎటువంటి విజన్ లేదని.. ఆ పార్టీకి ప్రజా సంక్షేమం అవసరం లేదన్నారు. కేవలం రాజకీయం, అధికారం, పదవుల కోసమే పాదయాత్రను చేస్తుందన్నారు.
బీపీఎల్ ఎవరి హయాంలో ప్రతిపాదించారని, నిర్మాణం కాకపోవడానికి కారణం ఎవరంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వ్యవసాయ భూములను తీసుకొని, మార్కెట్ విలువకు తగిన ధర చెల్లించలేదన్నారు. ఏ-పవర్ హౌస్ మూసివేతకు, బీ-పవర్ హౌస్ మూసే పరిస్థితికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. స్పిన్నింగ్, వీవింగ్ మిల్లుల గొంతు కోసి బొందపెట్టి, కాందిశీకుల ఆకలి చావులకు, ఆత్మహత్యలకు కారణమైన చరిత్ర కాంగ్రెస్ ది కాదా అని ప్రశ్నించారు. రామగుండం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాదయాత్ర చేసే నైతిక హక్కు వారికి లేదన్నారు.
15 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాజకీయ అత్యవసర పరిస్థితికి పాదయాత్రలు చేస్తున్నారనే విషయం ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణిలో ఒకప్పుడు 1.20 లక్షల మంది కార్మికుల సంఖ్య 60 వేలకు పడిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి, కార్మికుల ఉద్యోగాలను కాపాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో నగర మేయర్ బంగి అనీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, మేకల సదానందం, రమణారెడ్డి, బాలరాజ్ కుమార్, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు తోడేటి శంకర్ గౌడ్, అచ్చ వేణు, నడిపెల్లి మురళీధర్ రావు, జేవి రాజు, కలువల సంజీవ్ పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, చల్లా రవీందర్ రెడ్డి, పిల్లి రమేష్, కేశవగౌడ్, దొమ్మేటి వాసు, బూరుగు వంశీకృష్ణ, కొర్రి ఓదెలు, దాసరి శ్రీనివాస్, బెందె నాగభూషణం గౌడ్, బెంద్రం రాజిరెడ్డి, చల్లా దేవేందర్ రెడ్డి, గుంపుల ఓదెలు యాదవ్, మహేందర్ గౌడ్, అనుముల కళావతి, శాంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.