- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సైదాపూర్ మండలంలో విస్తృతంగా వాహనాల తనిఖీ..
దిశ, సైదాపూర్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్ పర్యవేక్షణలో ఆదివారం సైదాపూర్ మండలంలోని హుజురాబాద్ - హుస్నాబాద్ ప్రధాన రహదారి పై స్థానిక ఎస్సై సీహెచ్.తిరుపతి ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అక్రమ రవాణాదారుల గుండెల్లో రైళ్ళు పరి గెత్తేలా సైదాపూర్ మండల వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, మత్తుపదార్ధాలు, సారా రవాణా కాకుండా ఈ తనిఖీలు నిర్వహించారు. అతి వేగంగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను, శబ్ద కాలుష్యాన్ని సృష్టించే ద్విచక్ర వాహనాలు, హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, వాహనాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం ఎస్సై కొత్తపల్లి రవీందర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.