- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ నడపాలి : కలెక్టర్ ఆర్.వీ కర్ణన్
దిశ, కరీంనగర్ టౌన్ : మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ నడపాలని జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లు అవుతుందన్నారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు గాను సైక్లింగ్ ఒక మంచి మార్గమన్నారు. సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక గంట సైకిల్ తొక్కలన్నారు. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు తగ్గుతాయని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని, శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దారిద్య్ర రేఖకు దిగువనన్న ఐదుగురు పేద విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు.