- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారం పోయినా కేటీఆర్ కొవ్వు కరగట్లేదు
దిశ, జగిత్యాల ప్రతినిధి : వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉండే ఉంటుందంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గురువారం జగిత్యాలలో పర్యటించిన ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. అధికారం పోయినా కేటీఆర్ లో కొవ్వు కరగలేదని అన్నారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లినట్లుగానే కేటీఆర్ సైతం వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. లగిచర్ల దాడి విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడి విషయంలోనూ కేటీఆర్ హస్తం ఉందంటూ ఆయనను జైల్లో వేయడమే కరెక్ట్ అని అన్నారు.
అంతకు ముందు ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన దిశ సమావేశానికి అరవింద్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలపై రివ్యూ చేసి త్వరలో దిశ కమిటీ వేసి సభ్యులను నామినేట్ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం మారిందని, ఎమ్మెల్యే గతంలో సమావేశాలకు హాజరు అయ్యేవారు కాదని ఇప్పుడు రావడం సంతోషకరమని అన్నారు. త్వరలోనే జగిత్యాల, నిజామాబాద్ పట్టణాలను స్మార్ట్ సిటీ చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాల పేరు చెప్పి పవర్ లోకి వస్తాయన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారు.