సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర.. కేసీఆర్‌పై ఈటల ఫైర్

by Sathputhe Rajesh |
సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర.. కేసీఆర్‌పై ఈటల ఫైర్
X

దిశ, గోదావరిఖని: ప్రగతి భవన్ లో కూర్చొని ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం చాటేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీ మైదానంలో జరిగిన సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) 27వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ...సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై అసెంబ్లీలో,లేదా రామగుండంలో అయినా తాను చర్చకు సిద్ధమని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో బొగ్గు బావుల పేరు మీద వేల కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని దీనిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై బురద జల్లుతున్నారని అన్నారు.

సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘం పతనం మొదలైందన్నారు. ప్రగతి భవన్ లో కూర్చొని వ్యవస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రష్టు పట్టిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సింగరేణి ప్రైవేటు పరం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సింగరేణి కార్మికులే ముఖ్యమంత్రికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ జాతీయ నాయకులు కొత్త కాపు లక్ష్మారెడ్డి, అశోక్ మిశ్రా, మాధవ నాయక్, తూర్పు రాంరెడ్డి, మల్లోజుల కిషన్, యాదగిరి సత్తయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు

Advertisement

Next Story