- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలిగేడు మండల సమస్యలు తీర్చే వరకు వెంటాడతా: మాజీ ఎమ్మెల్యే విజయ రమణా రావు
దిశ, పెద్దపల్లి టౌన్: ఎలిగేడు మండలానికి ఇచ్చిన హామీలు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నెరవేర్చే వరకు వెంటాడుతానని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. గతంలో మండల కేంద్రానికి పోలీస్ స్టేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల,50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
సమస్యల సాధనకై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమర్థ ఎమ్మెల్యే తన కాలేజీలకు రోడ్లు వేపించుకునే శ్రద్ధ ప్రజలకు అభివృద్ధి చేయడానికి లేదన్నారు. కనీసం బస్సు డిపో లేని జిల్లా కేంద్రం పెద్దపల్లి అన్నారు. కమిషన్లు వచ్చే పనులు తప్ప.. ప్రజా అవసరాలు ఎమ్మెల్యేకు అక్కర్లేదని ఎలిగేడు మండలం లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఇప్పటి వరకు ముగ్గు కూడా పొయలేదని ఎద్దేవా చేశారు.
చిన్న మండలాలుగా ఏర్పడిన వాటికి పోలీస్ స్టేషన్లు వచ్చాయని, కానీ, ఎప్పుడో ఏర్పడ్డ ఎలిగేడు పై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు వేముల రామూర్తి విజయ రమణారావు కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, వేముల రామ్మూర్తి, అంతటి అన్నయ్య గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, మినుపాల ప్రకాష్ రావు, ధన్నాయక్ దామోదర్ రావు, నుగిల్ల మల్లన్న, సాయిరి మహేందర్, సయ్యద్ మస్రత్, గోదాల శ్రీనివాస రెడ్డి, సింగిరెడ్డి ఎల్లవ్వ-రాజేశ్వర్ రెడ్డి, దుగ్యాల సంతోష్ రావు, చిలుక సతీష్, కడార్ల శ్రీనివాస్, కట్కూరి సుధాకర్ రెడ్డి, కొండా తిరుపతి, కోరుకంటి వెంకటేశ్వర్ రావు, బోడకుంటి శంకర్, కళ్లేపల్లి జానీ, దాసంపల్లి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.