- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
collector : పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
by Sumithra |
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందో, ఇప్పటిదాకా ఎన్ని చేశారని డాక్టర్ కృష్ణవేణిని అడిగారు. మొత్తం 34 లక్ష్యం కాగా, ఇప్పటిదాకా 24 పూర్తి చేశామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని సూచించారు. కలెక్టర్ తో హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story