మానసిక అనారోగ్యమే ప్రమాదకరం.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి..

by Sumithra |
మానసిక అనారోగ్యమే ప్రమాదకరం.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆరోగ్యమే మహాభాగ్యమని శారీరక అనారోగ్యం కన్న మానసిక అనారోగ్యమే ప్రమాదకరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎన్ ప్రేమలత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో వరల్డ్ మెంటల్ హల్త్ డేను పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఉద్యోగులకు మానసిక ఒత్తిడి పై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈతరం వారి కంటే మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారని, పని ఒత్తిడి వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి సమస్యనైనా ఎదిరించవచ్చునని, మంచి జీవనాన్ని ఆచరించి పదిమందికి ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు.

నిత్య వ్యాయామం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. సామాన్యుల కంటే ఉద్యోగులు అధికంగా మానసిక ఒత్తిడికి లోనవుతారని, కోర్టు ఉద్యోగులు ఈ అవగాహన సదస్సును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ప్రముఖ మానసిక వైద్య నిపుణులతో కోర్టు ఉద్యోగులకు మానసిక అనారోగ్యం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్, జూనియర్ సివిల్ జడ్జ్ ప్రవీణ్, మానెరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, లోక్ అదాలత్ మెంబర్ చింతొజు భాస్కర్, బార్ అసోసియేషన్ ట్రెజరర్ బిట్ల విష్ణు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వంశీధర్, న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed