- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 26న తెలంగాణ కేబినెట్ సమావేశం
దిశ, వెబ్ డెస్క్ : ఈ నెల 26న 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయం భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ముందుగా నిర్ణయించిన 23వ తేదీకి బదులుగా 26వ తేదీకి కేబినెట్ సమావేశం కాబోతుంది. కేబినెట్ సమావేశంలో హైడ్రాయ మూసీ నది ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ.. రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
హైడ్రా ఏర్పాటును హైకోర్టు సమర్థించటం, ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించటం లాంటి అంశాలతో పాటు మూసీ ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఆయా అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశాలను వీలైనంత ముందుకు తేవాలని భావిస్తున్నట్లుగా సమాచారం.