- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jio Hotstar: త్వరలో రిలయన్స్, డిస్నీ+హాట్‌స్టార్ విలీనం..ఇకపై క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాలన్నీ అక్కడే..!
దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అనుబంధ సంస్థ వయాకామ్ 18(Viacom 18), ది వాల్ట్ డిస్నీ(The Walt Disney) కంపెనీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Star India Private Limited) వినోద వ్యాపారాలు మరికొన్ని నెలల్లో లివీనం కానున్న విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) కూడా ఆమోదం తెలిపింది. ఈ విలీన ఒప్పందం విలువ దాదాపు రూ. 70,000 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. వయాకామ్ 18, డిస్నీ+హాట్‌స్టార్ విలీనం పూర్తయితే దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థగా అవతరించనుంది. దీంతో వివిధ భాషల్లో వందకు కంటే ఎక్కువ ఛానెళ్లు, రెండు మెయిన్ ఓటీటీలు విలీన సంస్థ చేతిలో ఉండనున్నాయి. విలీనం అనంతరం ఈ జాయింట్ వెంచర్‌కు నీతా అంబానీ(Nita Ambani) ఛైర్‌పర్సన్‌గా, ఉదయ్ శంకర్(Uday Shankar) వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవరించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రెండు సంస్థల డీల్ అనంతరం ఒక్క ఓటీటీ ప్లాట్‍ఫామ్(single OTT platform) మాత్రమే ఉంచాలనే నిర్ణయాన్ని రిలయన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జియో సినిమా(Jio Cinema)ను డిస్నీ+హాట్ స్టార్(Disney+ Hotstar)లో విలీనం చేయనున్నారని సమాచారం. రెండు కంపెనీల సర్వీసులను కలిపి "జియో హాట్‌స్టార్(Jio Hotstar)" అనే పేరుతో కొనసాగించనున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా తొలుత హాట్‌స్టార్‌నే జియో సినిమాలో విలీనం చేస్తారని వార్తలు వినిపించాయి. స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వేర్వేరు ఓటీటీలను కొనసాగించాలని రిలయన్స్ మొదట్లో ఆలోచన చేసింది. అయితే చివరికి జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హాట్‌స్టార్‌కు ఇండియాలో ఉన్న మెరుగైన టెక్నాలజీ మద్దతు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ప్లే స్టోర్‌లో డిస్నీ+హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉండగా.. జియో సినిమాకు 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాలు(Cricket Match Live Broadcasts) హాట్‌స్టార్‌లోనే వీక్షించాల్సి ఉంటుందని కూడా తెలుస్తోంది.