- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోదండరామ్, ఆకునూరి మురళీ ఎక్కడ? నిరుద్యోగుల ఎజెండా అన్నారు? హరీశ్‌రావు ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కోదండరామ్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. నిరుద్యోగుల ఎజెండా నా ఎజెండా అన్నారు.. నిరుద్యోగుల గొంతుక అవుతానని కోదండరామ్ అన్నారు.. కానీ ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన గొంతు ఎందుకో మౌనం అయిందని విమర్శించారు.
కోదండరామ్, రియాజ్, నవీన్, ఆకునూరి మురళీ ఎక్కడున్నారు? వీళ్లకు ఉద్యోగాలు వచ్చాయి.. తప్ప నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు రాలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 29తో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఈబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. టాప్ మార్కులు వచ్చినా అభ్యర్థికి రిజర్వేషన్‌ను పరిగణించడం ద్వారా.. మరో రిజర్వ్‌డ్ అభ్యర్థికి అవకాశం లేకుండాపోయిందన్నారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు జీవో 55 ప్రకారం అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం చేశారని గుర్తుచేశారు.