- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ మెప్పు కోసమే కాంగ్రెస్ పై విమర్శలు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతావా కేసీఆర్..?
దిశ, జగిత్యాల ప్రతినిధి : లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు మోదీ మెప్పు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నీ బంగళాఖాతంలో కలుపుతవా అంటూ సీఎం కేసీఆర్ పై పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిర్మల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దశాబ్ధాల కల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. మీ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా అంటూ నిలాదీశారు.
ధరణి అనేది ప్రభుత్వానికి ఆదాయ పన్ను శాఖగా మారిందని విమర్శించారు. ప్రతి జిల్లాలో లక్ష ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ఎలాంటి కారణాలు చూపకుండా దరఖాస్తులను నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ధరణి సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో భూ మార్పిడి ప్రక్రియలో కేవలం స్టాంప్ డ్యూటీ మాత్రమే తీసుకున్నామని కానీ నేడు స్టాంప్ డ్యూటీ కి అదనంగా ఎకరానికి రూ.2,500 వసూలు చేస్తున్నారని ఇది ప్రజలను దోచుకోవడం కదా అని ప్రశ్నించారు.
ఎంతసేపు ఈ ప్రభుత్వం దరణితో ప్రజలపై ఏ విధంగా భారం వేయాలో చూస్తుంది తప్ప సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ధరణి దరఖాస్తులు పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒక రైతుబంధు పేరు చెప్పి రైతులకు రావలసిన రాయితీలు రాకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడింది మీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే చలించి రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, నాయకులు జున్ను రాజేందర్, బొల్లి శేఖర్, గుండా మధు, నేహాల్, రాజేష్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.