- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బలిదానాలతో రాష్ట్రం వస్తే పేపర్ లీకేజీలతో బాధలు తప్పడంలేదు: అడ్లూరి
దిశ, గొల్లపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని డీసీసీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిరసన వ్యక్తం చేస్తూ, రోడ్డుపై బైఠాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మన తెలంగాణ మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత బలిదానాలు చేసుకుంటే ఈ పేపర్ లీకేజీ చాలా దౌర్భాగ్యకరం, నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యోగాల సాధనకోసం వేల రూపాయలు ఖర్చు చేసి సిద్ధం అవుతుంటే, మరోవైపు పేపర్ లీకేజీలు చేస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి రాత్రి పగలు చదివిన పేద, మధ్య తరుగతి నిరుద్యోగుల పాలిట కేసీఆర్ పాలన శాపం అయిందన్నారు. ఎనభై శాతం బలహీన వర్గాలకు చెందినవారు ఉద్యోగుల కోసం చూస్తుంటే పేపర్ లీకేజీ పై నోరుమేదపడం లేదన్నారు.
ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్ పీఎస్సీ బోర్డు ఛైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేసి, బోర్డుని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో జరిగే పరీక్షలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు రేవల్ల సత్యం గౌడ్, సరసాని తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ ఉప సర్పంచ్ లు కొండ వెంకటేష్ గౌడ్, హరి, కిరణ్, శ్రీధర్, సీనియర్ నాయకులు రాపెల్ల గంగన్న, రాజారావు రామగౌడ్, రామ్ మోహన్ రెడ్డి, కొమురయ్య, గంగధర్, రమేష్, విజయ్, సత్తయ్య, దిలీప్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నేరళ్ల మహేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సంకటి శేకర్, తిరుపతి, శేకర్, సూరందర్ కుమార్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.