- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Singareni : నష్టపరిహారం చెల్లించాలి
దిశ, రామగిరి : సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా తాము కోల్పోయిన నష్టపరిహారాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ బుధవారం పేట గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. రామగుండం 3 ఏరియా ఓసీపీ 2 విస్తరణలో భాగంగా అప్పటి బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో 218 మంది రైతుల నుండి 708 ఎకరాలు సేకరించడానికి సింగరేణి సంస్థ నిర్ణయించింది. 2009 లో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రకటించి 2011 లో నోటిఫికేషన్ జారీ చేసి 2015 లో అవార్డు సైతం జారీ చేశారు. అవార్డు అనంతరం రైతుల భూములు
రెవెన్యూ రికార్డుల్లో సింగరేణి స్వాధీన భూములుగా పరిగణించబడ్డాయి. దీంతో గత ప్రభుత్వం అందించిన రైతు బంధు, రైతు బీమా, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోలేక పోయారు. ప్రభుత్వం నుండి పథకాలు అందక, భూములు అమ్ముకోలేక కొనుక్కోలేక ఆర్థికంగా నానా ఇబ్బందులూ పడ్డారు. పరిహారం విషయంలో కొంత మంది గ్రామస్తులు అంగీకరించక హైకోర్టు ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు అవార్డు రద్దు చేసి భూములను రైతులకు అప్పజెప్పి పట్టా పాసుబుక్కులు జారీ చేయాలని 2022 చివరలో తీర్పు ఇచ్చింది.
కేవలం 88ఎకరాలకే నోటిఫికేషన్
హైకోర్టు తీర్పు అనంతరం తమ కష్టాలు తీరాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంలో సింగరేణి సంస్థ 708 ఎకరాల్లో నుండి నేటి రాజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 88 ఎకరాలను సేకరించాలని నిర్ణయించి మూడు నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాజాపూర్ గ్రామస్తులు భూములతో పాటు ఇండ్లను కూడా తీసుకుంటేనే సింగరేణి సంస్థకు సహకరిస్తామని తెగేసి చెప్పారు.
నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు లో పిటిషన్
సింగరేణి సంస్థ వల్ల అన్ని విధాలుగా నష్టపోయామని బుధవారంపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతిన భూములు సేకరించి తమను రోడ్డున పడేశారని, ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన చెందారు. రైతులకు పట్టా పాసుబుక్కులు జారీ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా పూర్తి స్థాయిలో నేటికి అమలు కావడం లేదన్నారు. దీంతో బుధవారం పేట
గ్రామానికి చెందిన బుద్దార్థి బుచ్చయ్య, మరికొందరు గ్రామస్తులు కలిసి హైకోర్టు ను ఆశ్రయించారు. సింగరేణి సంస్థ నిర్లక్ష్యం వల్ల 6 కోట్ల మేర నష్టపోయామని, అవి తిరిగి చెల్లించాలని బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం పేట గ్రామస్తులకు న్యాయం జరిగేంత వరకు ప్రయత్నిస్తానని న్యాయవాది పోనంపెల్లి రవి వెల్లడించారు.
- Tags
- Singareni