Collector Sandeep Kumar Jha : వసతి గృహాల్లో స్వచ్చత పాటించాలి

by Aamani |
Collector Sandeep Kumar Jha :  వసతి గృహాల్లో స్వచ్చత పాటించాలి
X

దిశ, చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ లోని స్టోర్ రూమ్, టాయిలెట్, కిచెన్, గదులు, రిజిస్టర్ పరిశీలించారు. మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారని డీఎస్ సీడీఓ విజయ లక్ష్మిని అడుగగా, 35 మంది విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం విద్యార్థులకు ఏమి టిఫిన్ పెట్టారని తెలుసుకోగా, అటుకులు, సేమియా ఇచ్చామని చెప్పారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మ్యాథ్స్ చేయించి.. ఇంగ్లీష్ చదివించి..

అనంతరం కలెక్టర్ చందుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో మ్యాథ్స్ సమస్యలను పరిష్కరింపజేశారు. ఇంగ్లీష్ లెసన్స్ చదివించారు. పిల్లలు రాయడం, చదవడం, సమస్యల పరిష్కారంలో ముందు ఉండేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదే ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఇక్కడ డీఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed