Collector Pamela Satpathy : గర్భిణీలకు పోషకాహారం అందించే బాధ్యత అధికారులదే

by Aamani |
Collector Pamela Satpathy : గర్భిణీలకు పోషకాహారం అందించే బాధ్యత అధికారులదే
X

దిశ, చిగురుమామిడి: ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందజేస్తున్న పోషకాహారాన్ని సక్రమంగా అందేలా సిబ్బంది చూడాలని కరీంనగర్ కలెక్టర్‌ పమేల సత్పతి అన్నారు. చిగురుమామిడి మండలం చిన్న ములుకనూరు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణుల్లో పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు సరుకులు అందజేస్తుందన్నారు.

బాలలకు విద్యాభ్యాసం, గర్భిణులకు సమయానుకూలంగా తీసుకోవాల్సిన ఆహారం సిబ్బంది అందజేస్తున్నారని చెప్పారు. దీంతో పాటు వారు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు తెలియజేయడంతో పాటు బాలింతలకు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed