- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TRS మంత్రుల మధ్య కోల్డ్ వార్.. చిచ్చు పెట్టింది ముఖ్యమంత్రి టూరేనా?
దిశ, నిఘా ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ ఆ ఉమ్మడి జిల్లా మంత్రుల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యేలా చేసిందా..? సంబంధం లేని జిల్లాలో ఆ మంత్రి ఎలా జోక్యం చేసుకుంటాడన్న వాదన తెరపైకి తీసుకొచ్చారా..? ఇన్‌చార్జి వ్యవహారంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న రచ్చ కాస్తా అధినేత వరకూ చేరిందా లేదా అన్నదే ఆ జిల్లాలో జరుగుతున్న మెయిన్ టాపిక్.
పెద్దపల్లి టూర్‌తో..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. సీఎం టూర్ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించడం, జన సమీకరణ కోసం పార్టీ క్యాడర్‌తో మాట్లాడడం, అధికారులతో సమీక్షలు జరపడం వంటి కార్యకలాపాలకు సంబంధిత జిల్లాకు చెందిన మంత్రి తన భుజాలపై బాధ్యతలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఉన్నట్టుండి ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి పెద్దపల్లిలో ఎంట్రీ ఇచ్చి తనను ఇన్‌చార్జి ఉండాలని పెద్దాయన చెప్పారంటూ జోక్యం చేసుకోవడంతో సొంత జిల్లాకు చెందిన మంత్రితో పాటు నాయకులు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు.
అయితే సీఎం టూర్ అయితే సక్సెస్ కావాలని లేనట్లయితే పార్టీకి తలవంపులు తెచ్చినట్టు అవుతుందని బావించిన పెద్దపల్లి జిల్లా లీడర్స్ అంతా కూడా కిమ్మనకుండా పనులు చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కువ జోక్యం చేసుకున్న మంత్రి తీరు గురించి అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అదిష్టానం వద్ద తానే అన్ని చూసుకుంటానని మాట ఇచ్చిన సదరు మంత్రిగారు చేతల్లో మాత్రం రిక్త హస్తం చూపించారని కూడా ముఖ్య నాయకులకు సమాచారం చేరవేసినట్టు తెలుస్తోంది. సంబంధం లేని జిల్లా టూర్ విషయంలో తల దూర్చి జనసమీకరణ, సభా వేదికకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల బాధ్యత తనదేనని చెప్పుకున్నప్పుడు మాపై భారం ఎందుకు పడుతుందని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ నేత కూడా అధిష్టానం చెవిలో ఊదినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లాకు చెందిన కొంతమంది ముఖ్య నేతల వద్ద సీఎం సభ ఏర్పాట్లకు అంటూ అమౌంట్ కలెక్ట్ చేశారని కూడా పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం దృష్టికి..
పెద్దపల్లి ఎపిసోడ్‌కు సంబంధించిన వ్యవహారం అంతా కూడా పూసగుచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా అధినేత వద్దకు చేరినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.
Also Read: ఆ దమ్ము మీకుందా...? : ఎమ్మెల్యే రేగా బహిరంగ సవాల్