Seethakka: రేపు రాజస్థాన్ కు మంత్రి సీతక్క

by Prasad Jukanti |
Seethakka: రేపు రాజస్థాన్ కు మంత్రి సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి సీతక్క (Seethakka) రేపు రాజస్థాన్ (Rajasthan) కు వెళ్లనున్నారు. అక్కడ ఉదయపూర్ లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేపటి నుంచి జరగబోయే చింతన్ శివిర్ (Chintan Shivir)లో మంత్రి పాల్గొననున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, అంగన్ వాడీ పోషన్ 2.0 పై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క హాజరుకాబోతున్నారు. శుక్రవారం రాత్రి ఉదయపూర్ కి బయలుదేరి శనివారం తెల్లవారు జామున మంత్రి ఉదయపూర్ చేరుకోనున్నారు. శనివారం చింతన్ శివిర్ లో సీతక్క ప్రసంగించనున్నారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం వంటి అంశాలపై మంత్రి మాట్లాడనున్నారు.

Advertisement

Next Story