చెట్లను పెంచాలి

by Sridhar Babu |
చెట్లను పెంచాలి
X

దిశ, గోదావరిఖని : రామగుండం ఏరియా ఉపరితల గనుల ఆవరణలో చెట్లను అధికంగా పెంచాలని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా.బి. ప్రభాకర్ సీసీఎఫ్ కాళేశ్వరం సర్కిల్ సింగరేణి అధికారులను ఆదేశించారు. గురువారం రామగుండం ఏరియా –1ను సందర్శించి మాట్లాడారు. మేడిపల్లి ఉపరితల గనిని సందర్శించి బంగ్లాస్ ఏరియాకు వచ్చారు. సుమారు 650 హెక్టార్ల విస్తీర్ణంలో గల మేడిపల్లి ఉపరితల గనికి సంబంధించి మ్యాపులను పరిశీలించారు. మేడిపల్లి వ్యూ పాయింట్ వద్ద నుండి క్వారీ ఓవర్ బర్డెన్ డంపులపైన పెంచిన అటవీ ఏరియాను పరిశీలించారు.

కొత్తగూడెంలో వీకే ఓసీపీ ప్రాజెక్ట్ కోసం మేడిపల్లి ఉపరితల గని వద్ద ప్రతిపాదించిన ఫారెస్ట్ ల్యాండ్ లను పరిశిలించారు. గని పరిసరాలలో అడవిని విస్తారంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో చర్చించారు. అంతకు ముందు పెద్దపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారి సీహెచ్. శివయ్య , ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ 2 జీఎం గోపాల్ సింగ్, ఎస్టేట్ డీజీఎం కుమార స్వామి, ఏరియా ఎన్విరాన్ మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఫారెస్ట్ అధికారి కర్ణ, ఎస్టేట్ మేనేజర్ సాంబ శివ రావు, మేనేజర్ మల్లిఖార్జున్ యాదవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story