- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News : అభిమనులపై పవన్ ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్ : తన అభిమానులపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Deputy CM Pavan Kalyan) తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా బాధితులను పరామర్శించేందుకు పవన్... స్విమ్స్, రుయా ఆసుపత్రికి వెళ్ళగా.. పవన్ వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. భారీగా అభిమానుల రాకపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ ఫైర్ అయ్యారు. తొక్కిసలాట జరిగినా ఇప్పుడు కూడా జనాలను కంట్రోల్ చేయలేరా? అంటూ పోలీసులపై మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు. తప్పు జరిగింది.. క్షమించండి.. ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం కోల్పోవడం సరైంది కాదని బాధ పడ్డారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) దర్శన టోకెన్ల జారీలో ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలం అయ్యారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు.