క్రీడా రంగానికి సీఎం కేసీఆర్ తగిన ప్రోత్సాహం : కోరుకంటి చందర్

by Shiva |
క్రీడా రంగానికి సీఎం కేసీఆర్ తగిన ప్రోత్సాహం : కోరుకంటి చందర్
X

దిశ, గోదావరి ఖని : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడారంగానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం ఎనిమిదో కాలనీ అబ్దుల్ కలాం స్టేడియంలో భారత్ జాగృతి కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశామని తెలిపారు.

క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకుందని తెలిపారు. ప్రతి సంవత్సరం కోరుకంటి ప్రీమియర్ లీగ్ తో తాము క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు మనిషి ఆరోగ్యంతో జీవిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య, నాయకులు ఆయిలి శ్రీనివాస్, మేడి సదయ్య, పులి రాకేష్, తమ్మన వేణు కుమార్, సంధ్యా రెడ్డి, కుమార్ నాయక్, టోర్నమెంట్ నిర్వాహకులు కండే సురేష్, పాశం ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story