- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓట్లు బహుజనులవి.. అధికారం అగ్ర వర్ణాలకా?.. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ R. S. Praveen Kumar
దిశ, పెగడపల్లి: ఓట్లు బహుజనులవి అధికారం మాత్రం అగ్ర వర్ణాలకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడతలో బాగంగా మండలంలోని సుద్దపల్లి, బతికేపల్లి, నామాపూర్ గ్రామాల్లో ఆర్ఎస్పీ పాదయాత్ర నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ గ్రామంలో చూసినా సొంత ఇండ్లు లేవు, డబుల్ బెడ్ రూమ్ లు రాలేవు అని కూలి నాలి చేసుకుంటూ అద్దె ఇంట్లో బతుకుతున్నాం అని పేదలు చెబుతున్నారని చెప్పారు. ఉద్యోగాలు రాలేవు అని యువత తమ గోడును వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమి అని మభ్యపెట్టి గుంట భూమి ఇయ్యకపోగా ఉన్న భూముల్ని లాక్కొని వారిని కూలీలుగా మార్చిందని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బహుజనులు ఓట్లతో గెలిచినవాళ్లు విలాసవంతమైన జీవితాన్ని గడిపతే బహుజనులు మాత్రం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు, మద్యానికి ఓటు అమ్ముకోకుండా తమ ఓటు తమకే వేసుకుంటే బహుజనుల బతుకులు మారుతాయని అన్నారు. బహుజనుల కి రాజ్యాధికారం దక్కినపుడే పేదల బతుకులు మారుతాయని అది ఒక్క బీఎస్పీ తోనే సాధ్యమని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ యాత్రలో బీఎస్పీ నియోజక వర్గ ఇంచార్జీ నక్క విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు నక్క గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పెంట మల్లేశం, ఉపాధ్యక్షుడు మల్యాల రవి, నాయకులు గంగాధర్, ముంజ లీల, అజయ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.