- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ : గీతామూర్తి
దిశ, హుజూరాబాద్ : తెలంగాణాలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో జయకేతనం ఎగుర వేస్తుందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చంద్రిక అధ్యక్షతన కోటి సెల్ఫీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గీతా మూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులవుతున్న వారందరు రానున్న రోజుల్లో బీజేపీలో చేరనున్నారన్నారు. లబ్ధిదారులను ఏకం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. నిరంతరం కొనసాగనున్న కోటి సెల్ఫీ కార్యక్రమంలో లబ్ది పొందిన మహిళలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ , నాయకురాళ్లు ఉమారాణి, కల్లెపు రేణుక, రమాదేవి, సువర్ణ, శారద, చంద్రకళ, రమ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.