- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు బీజేపీ మద్దతు
దిశ, కరీంనగర్ టౌన్ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు బీజేపీ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుండి తొలగిస్తామనడం దుర్మార్గమన్నారు. రేపటి సమ్మెను భగ్నం చేసేందుకు ఆర్టిజన్లను ముందస్తుగా అరెస్టులు చేస్తూ బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.
నేడు కరీంనగర్ లో పర్యటిస్తున్న బండి సంజయ్ కుమార్ ను ఎంపీ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మధుకుమార్, రవీందర్ రెడ్డి తదితరులు సమ్మెకు మద్దతివ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి సమ్మెకు సంఘీభావం ప్రకటించిన బండి సంజయ్ కుమార్ కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తూ ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఆర్టిజన్లకు విద్యుత్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.