- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు పూర్తిభరోసా.. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి
దిశ, పెద్దపల్లి కలెక్టరేట్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బూటకపు మాటలతో రైతులని మభ్యపెడుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు గుజ్గుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, నాయకులు కౌశిక్ హరిలు విమర్షించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్య వైరిని ఎండగట్టేందుకుగాను ఈనెల 23 నుంచి జిల్లాలోని పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం మండలాల్లోని దాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించి, రైతులకు భరోసా కల్పించి వారు రైతుల ఎదుర్కొంటున్న ధాన్యం గొనుగోల్ల పై మే 30న రైతు ధర్మాకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గుజ్జుల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేయడంలో మీనావేషాలు లెక్కించడం వల్ల నెలన్నర గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లోనే ఇప్పటికీ దాన్యం కుప్పలు ఉన్నాయని మండిపడ్డారు. మిల్లర్త్లతో కుమ్మక్కైన ప్రభుత్వం బస్తాకు 8కిలోల చొప్పున తరుగు తీయడం నీచమైన చర్యగా అభివర్ణించారు. దేశానికి అన్నం పెట్టె రైతుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని, బీజేపీ పార్టీ పక్షాన ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ ముందు వేలాది మంది రైతులతో కలిసి ధర్నాచేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరెట్ పరిసప్రాంతాన్ని బీజేపీ నాయకులు పరీశీలించారు. వారి వెంటకన్నం అంజయ్య, ఠాకూర్ రామ్ సింగ్, పర్ష సమ్మయ్య, వెల్లంపల్లి శ్రీనివాస రావు, తోడుపు నూరి కృష్ణమూర్తి, పుట్టరవి, మారం వెంకటేశం, పెండ్యాల కుమార్, స్వామి, లక్ష్మీనారాయణ, రవి తదితరులు ఉన్నారు.