వడ్ల కొనుగోలు కేంద్రంలో.. రైతుపై దాడి

by Shiva |
వడ్ల కొనుగోలు కేంద్రంలో.. రైతుపై దాడి
X

దిశ, మల్లాపూర్ : మండలంలోని నడికూడ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో ఎక్కువ తూకం వేస్తున్నారని, హమాలి చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని అదే గ్రామానికి చెందిన రైతు అప్పం చిన్నారెడ్డి ప్రశ్నించాడు. అందుకు గాను కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న వ్యక్తి చిన్నారెడ్డి పై దాడి చేశాడు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ వడ్లు తూకం వేయడానికి ఎన్నో రోజులుగా ఎదురుచూడాల్సి వస్తుంది.

వడ్ల కొనుగోలు కేంద్రాల్లో హమాలి చార్జీలు క్వింటాలు 40 రూపాయలు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఎక్కువ తూకం హమాలీ చార్జీలు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రశ్నించగా తనపై దాడి చేశారని చిన్నారెడ్డి తెలిపారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ రైతులు విమర్శిస్తున్నారు. గాయపడిన చిన్నారెడ్డిని మెట్ పల్లి ఆసుపత్రికి తరలించారు. రైతు చిన్నారెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed