- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఆధ్వర్యంలో అన్నపూర్ణగా తెలంగాణ..
దిశ, కోరుట్ల రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మనతెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మండలంలోని ధర్మారం, అయిలాపూర్, కల్లూర్, మాదాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకెపీ కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భాలలో ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులతో ప్రతిఎకరాకు నీరందించి రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండటానికి కేసీఆర్ ముందుచూపు దోహదపడిందన్నారు.
ఈ క్రమంలోనే పంటల దిగుబడి దేశంలోనే అత్యుత్తమ స్థాయికి చేరిందన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతుల చేతిలో అత్యంత తక్కువ కాలంలో డబ్బులు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రతిపక్షాలవి పసలేని విమర్శలని దుయ్యబట్టారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ తోటనారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.