అంజన్న భక్తులకు పొంచి ఉన్న ప్రమాదం

by Aamani |
అంజన్న భక్తులకు పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ,కొడిమ్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకునేందుకు నిత్యం వందలాది వాహనాలు ఈ రహదారి గుండా వెళుతూ ఉంటాయి. రహదారిని ఆనుకొని ఉన్న వ్యవసాయ బావి కోతకు గురై కారు రోడ్డును తాకుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారులో కొండగట్టు కు వెళ్లే రహదారి కి ఆనుకొని ఉన్న వ్యవసాయ బావి గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోతకు గురై ప్రస్తుతం తారు రోడ్డును ఆనుకొని ఉన్నది. దూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వచ్చే భక్తులు వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు గమనించాక బావిలో పడే ప్రమాదం ఉంది. గతంలో కూడా కొండగట్టు కు వెళ్తున్న కారు బావిలో పడి నట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటి అధికారులు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కావున అధికారులు సత్వరమే రక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

రక్షణ చర్యలు చేపడతాం..

బావి కోతకు గురైన విషయం తమ దృష్టికి వచ్చిందని గతంలో కూడా గతంలో కూడా ప్రమాద నివారణ చర్యలో భాగంగా గోడ నిర్మించడం జరిగింది. బావిలో మీరు అధికంగా ఉండటం వల్ల బావి కోతకు గురవడంతో నిర్మించిన గోడ సైతం కూలిపోయిందని శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు ఆర్ అండ్ బి డి ఈ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed