Suda Chairman : శాసనసభ వేదికగా చేసిన తప్పులు ఒప్పుకోండి..

by Sumithra |
Suda Chairman : శాసనసభ వేదికగా చేసిన తప్పులు ఒప్పుకోండి..
X

దిశ, కరీంనగర్ టౌన్ : కేటీ.రామారావు బృందం ప్రాజెక్టుల సందర్శన దొంగనే దొంగా దొంగా అని అరచినట్టుందని, ఇప్పటికైనా శాసనసభ వేదికగా గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో చేసిన తప్పులు ఒప్పుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసి నీటినిల్వకు ఆస్కారం లేకుండా చేసి ఏముఖం పెట్టుకొని ప్రాజెక్టులు సందర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శనలో అధికారులతో మాట్లాడితే నలభై అయిదు శాతం వర్షపాతం తక్కువ నమోదైందని అన్నారని చెప్పిన కేటీ.రామారావు ఎల్ఎండీ ప్రాజెక్ట్ నిండలేదని దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ప్రతిపాదించినట్టు తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే తక్కువ వ్యయంతో నిర్మాణం అయి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవని, గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా నీటి నిల్వకు ఉపయోగపడకుండా పోయిందని గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు మాత్రమే మిగులుతారని ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీలకు వెళ్ళడం ఖాయమణి జోష్యం చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు చూస్తూ ఊరుకోరని తరమికొడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజొద్దిన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ నాయక్, అబ్దుల్ రహెమాన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పొరండ్ల రమేష్, విద్యాసాగర్, మెతుకు కాంతయ్య, ఖమ్రొద్ధిన్, మ్యాకల నర్సయ్య, దండి రవీందర్,కుర్ర పోచయ్య, దన్న సింగ్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, హసీనా, తిరుమల, మహాలక్ష్మి, కీర్తి కుమార్, షేహెన్ష, అష్రఫ్, పెద్దిగారి తిరుపతి, నెల్లి నరేష్, వడ్డే వెంకట్ రెడ్డి, లయక్, జిలుకర రమేష్, మెరాజ్, కొట్టె ప్రభాకర్, అస్తపురం రమేష్, లింగమూర్తి, ఖలీల్, బషీర్, శిరీష్, అనిల్ కుమార్, ఉప్పరి అజయ్, శారద, మాసుం ఖాన్, రాజ్ కుమార్, సుధాకర్, సర్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story