- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
collector : పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ పై కలెక్టర్ ఆగ్రహం...
దిశ, మెట్ పల్లి : విద్యార్థుల పట్ల బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం రోజున మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన ఘటన పై ఆయన విద్యార్థులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అస్వస్థత పై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ఘటన పై పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులకు కిటికీలు లేకపోవడం, పారిశుధ్యం సరిగా లేక పోవడం మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పై విచారణ చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.