ప్రమాదవశాత్తు దివ్యాంగుడి మృతి

by Shiva |
ప్రమాదవశాత్తు దివ్యాంగుడి మృతి
X

దిశ, శంకరపట్నం: ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగ యువకుడు నీటి సంపులో పడి మృతిచెందిన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని వంకాయ గూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్ఠులు తెలిపిన వివరాలు ప్రకారం ఇజ్జి గిరి సతీష్ (33) అనే దివ్యంగ యువకుడు తన ఇంట్లో ఉన్న నీటి సంపు వద్దకు చేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతను ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఐలయ్య ఫిర్యాదు మేరకు కేశవపట్నం ఎస్సై దేశ్ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story