రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు

by Nagam Mallesh |
రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు
X

దిశ, వేములవాడః వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఏసీబీ దాడులు నిర్వహించారు. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో గురువారం సోదాలు నిర్వహించారు. మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో సహా ఏసీబీ అధికారులు ఆలయంలోని ప్రతి విభాగంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. లడ్డు తయారీ విభాగంతో సహా గోదాం, అన్నదాన సత్రం, శానిటేషన్ తదితర విభాగాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నివేదికను ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.

Advertisement

Next Story